చూస్తుండగానే వెంకీ ముగించేస్తున్నారు

చూస్తుండగానే వెంకీ ముగించేస్తున్నారు

Published on Apr 2, 2021 1:17 AM IST

Venkatesh

ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన చిత్రాల్లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ మంచి విజయాన్ని అందుకుంది. ‘దృశ్యం’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. వెంకీ గతంలో ‘దృశ్యం’ను కూడ రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అందుకే పార్ట్ 2 కూడ రీమేక్ చేస్తున్నారు. సినిమా మొత్తం నేచ్యురల్ లొకేషన్లలోనే కావడంతో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

దర్శకుడు జీతూ జోసెఫ్ అలవోకగా చిత్రీకరణ చేసేస్తున్నారు. మొదటి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. ఇందులో సుమారు 40 నుండి 50 శాతం సినిమా పూర్తయిందట. ఇక రెండవ షెడ్యూల్ కేరళలో జరుపుతున్నారు. వెంకీ, మీనా, నదియా, ఇతర ముఖ్య తారాగణం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇది పూర్తైతే టాకీ పార్ట్ పూర్తైనట్టే. తక్కువ సమయంలోనే సినిమా కంప్లీట్ అవుతుండటం విశేషమనే చెప్పాలి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. సంపత్, నరేష్ లాంటి ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు