
తెలుగు చిత్రసీమలో ‘ఈగ, అందాల రాక్షసి, లెజెండ్, ఉహలు గుస గుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, తుంగభద్ర’ వంటి విజయవంతమైన చిత్రాలను వారాహి చలనచిత్రం బ్యానర్ పై నిర్మించిన ఆ సంస్థ అధినేత సాయికొర్రపాటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులౌతున్నారు. అదెలాగంటే టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ ‘బాహుబలి’ ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. కృష్ణాజిల్లాలో బాహుబలి చిత్రాన్ని 30 బెనిఫిట్ షోలను వారాహి చలనచిత్రం వారు ప్రదర్శించనున్నారు. ఈ షోల నిర్వాహణకు అక్కడ కలెక్టర్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఈ బెనిఫిట్ షోల ద్వారా వచ్చే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేయాలని వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి నిర్ణయించుకున్నారు. గతంలో కూడా హుదూద్ తుఫాన్ బాధితుల కోసం ఆర్ధిక సహాయం చేయడమే కాకుండా 100 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇప్పుడు ‘బాహుబలి’ బెనిఫిట్ షోల ద్వారా వచ్చే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అందజేయడం ఆయన సహృదయతకు నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యులౌతున్న వారాహి చలనచిత్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యులౌతున్న వారాహి చలనచిత్రం
Published on Jul 8, 2015 1:00 PM IST
సంబంధిత సమాచారం
- మా ఇంటి బంగారం.. మరింత ఆలస్యం కానుందా..?
- ఇంటర్వ్యూ : సుమంత్ ప్రభాస్ – గోదారి గట్టుపైన అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- ‘వారణాసి’ గ్లింప్స్.. కొత్తదా? పాతదా?
- విషాదం : ప్రముఖ నిర్మాత ఆర్ బి చౌదరి కన్నుమూత
- ఎన్టీఆర్-నీల్ కోసం స్టార్ రైటర్ డైలాగ్స్.. పంచ్ అదిరిపోవడం ఖాయం..!
- వైరల్ వీడియో: విజయ్ ఎలక్షన్ గెలుపును ముందే ఊహించిన స్టార్ హీరోయిన్.. నిజమైన పూజా హెగ్డే జోస్యం!
- ట్విస్ట్: విజయ్ స్థానంలోకి త్రిష ఎంట్రీ?
- ‘కల్కి 2’ కి బ్రేక్.. మరి ఎప్పటి నుంచి?
- ‘పెద్ది’కి అక్కడ పోటీ తప్పదా.. పాన్ ఇండియా రిలీజ్ పై ఫ్యాన్స్ టెన్షన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఆరాధన’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘పెద్ది’ ఆట షురూ.. తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్!
- ‘విజయ్’ ప్రభంజనం: ద్రవిడ రాజకీయాలకు ఎండ్ కార్డ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసిన దళపతి!
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- ఎన్నిసార్లయినా ప్రేమలో పడొచ్చు – తమన్నా
- సూపర్ స్టార్ సినిమాకి భారీ రేట్లు ?
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- పెద్ది ట్రైలర్ కట్ సిద్ధం.. ఇక రికార్డులు బ్రేక్ అవడం ఖాయం..!

