రవితేజ ‘క్రాక్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on May 30, 2020 8:10 pm IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో రానున్న ‘క్రాక్’ సినిమాలో ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’ లేడి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏదో మెయిన్ విలన్ చాటు లేడీ విలన్ లా కాకుండా.. ఆమె కూడా మెయిన్ విలన్ గానే ఈ సినిమాలో కనిస్తోందట. తన భర్తను చంపిన హీరో మీద పగ బట్టిన ఆడదాని పాత్రలో ఆమె నటిస్తోందట.

కాగా హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా ఎందుకో హీరోయిన్ గా మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ కంటిన్యూ కాలేకపోయింది. ఇండస్ట్రీ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నా.. ఎక్కువుగా సేడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవుతూ వస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమా ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More