తెలుగు వరుస హిట్స్ తో సాలిడ్ హిట్ రేట్ ఉన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. అయితే ఆమె తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ నుంచి లేటెస్ట్ గా వస్తున్న చిత్రమే “పోలీస్ కంప్లైట్” అయితే ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేసామని, అది సినిమాకే మెయిన్ హైలెట్ అని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు. అలాగే నేడు సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఈ చిత్రాన్ని ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థల సంయుక్త బ్యానర్లలో సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, అఘోర (తెలుగు, తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం వంటి వినూత్న చిత్రాలను రూపోందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. “సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకే వస్తుందని కాన్సెప్ట్ తో, హారర్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.” అని చెప్పారు.
అలాగే నిర్మాతలు సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ.., “వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తున్న పాత్ర సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ మీద చేసిన స్పెషల్ సాంగ్ అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నాం. యాక్షన్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళవించి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించబోతున్న ఈ చిత్రానికి “పోలీస్ కంప్లెయింట్” అనే టైటిల్ ఫిక్స్ చేశాం. దర్శకుడు సంజీవ్ మేగోటి రచన, దర్శకత్వం బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.” అని చెప్పారు.
ఈ సినిమాలో వరలక్ష్మి, నవీన్ చంద్రలతో పాటు ప్రముఖ నటులు శరత్ లోహితాశ్వ, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమినీ సురేష్, జబర్దస్త్ నవీన్, బేబీ తనస్వి (పొట్టేలు ఫేమ్) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సీనియర్ నటులంతా సీరియస్ పాత్రల్లో అలరించనున్నారు.
