టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ఈ మూవీ దేశవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాలో స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
వారణాసి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరో క్రేజీ సీక్వెల్‌లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కల్కి’కి సీక్వెల్‌గా కల్కి-2 రానున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపిక పదుకొనే ఓ కీలక పాత్రలో నటించింది. కానీ, ఇప్పుడు సీక్వెల్ చిత్రంలో ఆమె నటించబోదని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆమె స్థానంలో ఇప్పుడు ప్రియాంక చోప్రా ఆ పాత్రలో నటిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి నిజంగానే దీపిక స్థానాన్ని ప్రియాంక చోప్రా రీప్లేస్ చేసిందా.. అనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ‘కల్కి 2’లో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ విలన్ పాత్రల నటించనుండగా వైజయంతి పిక్చర్స్ బ్యానర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు.


