క్రేజీ డైరెక్టర్ గురించి రకరకాల ఊహాగానాలు !
Published on Aug 2, 2018 8:00 am IST

కార్తికేయ, పాయల్ రాజపుత్‌ లను హీరో హీరోయిన్లుగా పెట్టి “ఆర్ఎక్స్ 100” అనే బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు దర్శకుడు అజ‌య్ భూప‌తి. ఈ చిత్రం బాక్స్ అఫీస్ వద్ద భారీ షేర్‌ను రాబట్టుకుంది. దీంతో అజ‌య్ భూప‌తికి వరుసగా అవకాశాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో రోజుకొక వార్త పుట్టుకొస్తోంది.

తాజాగా వస్తున్న వార్తలను ఓ సారి పరిశీలిస్తే అజ‌య్ భూప‌తితో సినిమా చేయడానికి పలు నిర్మాతలు ఇంట్రస్ట్ గా ఉన్నారట. స్రవంతి రవికిషోర్ ఇప్పటికే హీరో రామ్ కి సరిపడ సబ్జెక్ట్ తో రావాలన అజయ్ భూపతికి ఆఫర్ ఇచ్చినట్లు, అలాగే భవ్య క్రియేషన్స్ నుంచి, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి నుంచి కూడా అజ‌య్ భూప‌తికి కాల్స్ వెళ్లినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.

అలాగే బాలీవుడ్ అనురాగ్ కశ్యప్ తమ బ్యానర్ లో నిర్మించే ఓ కొత్త సినిమాకి అజయ్ ను డైరెక్ట్ చేయమని సంప్రదించారని, అలాగే తమిళ హీరో ధనుష్ అజేయ్ కు కథ చెప్పమని ఆఫర్ ఇచ్చారని ఇలా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రస్తుతం హల చల్ చేస్తునే ఉన్నాయి. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం వీటిల్లో చాలా వరకు అవాస్తవాలేనని తెలుస్తోంది. కాగా త్వరగా ఈ దర్శకుడు తన తర్వాత చిత్రాన్ని ప్రకటిస్తే తప్ప ఈ రూమర్స్ ఆగవు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook