క్రియేటివిటీ వదిలేసి, కాంట్రవర్సీ నమ్ముకున్న వర్మ

క్రియేటివిటీ వదిలేసి, కాంట్రవర్సీ నమ్ముకున్న వర్మ

Published on Sep 7, 2019 1:32 PM IST

ఇప్పటితరాన్ని వర్మ ఎవరని అడిగితే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అని చెవుతారు. గత కొన్నేళ్లుగా వర్మ వివాదానికి మారుపేరుగా మారిపోయాడు. చాలా మంది దృష్టిలో విలువ కోల్పోయాడు. చాలా సందర్భాలలో తన స్థాయి మరచి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయి. కానీ వర్మ అంటే ఇది కాదు. ఒక్కప్పటి వర్మ గురించి నేటి యువతకు తెలిస్తే వారు నోళ్లెళ్లబెట్టడం ఖాయం.

తన మొదటి చిత్రంతోనే సంచలనాలు నమోదుచేసిన దర్శకుడు వర్మ. శివ అనే చిత్రంతో టాలీవుడ్ కి కొత్త ట్రెండ్ ని పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తెలుగు వాడి సత్తా చాటిన మొట్టమొదటి సౌత్ డైరెక్టర్ వర్మ.అక్కడ రంగీలా, సత్య, సర్కార్, భూత్, కంపెనీ వంటి విభిన్న చిత్రాలు అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వర్మ. అలాంటి వర్మ కొద్దికాలంగా క్రియేటివిటీ వదిలేసి కాంట్రవర్సి పై పడ్డారు.

రక్త చరిత్ర, రక్త చరిత్ర2, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి చిత్రాలన్నీ అలా కాంట్రవర్సీ క్రియేట్ చేసినవే. ఎదో ఒక వర్గాన్ని, పార్టీని, వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఆయన తీసిన చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన దాఖలాలు కూడా లేదు. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే మరో వివాదాస్పద చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఎటువంటి నిర్మాణ విలువలు లేకుండా, వివాదమే పెట్టుబడిగా రెండు మూడు నెలలో ఇలాంటి చిత్రం తీసి లబ్ది పొందాలని చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు