నేడు సైరా చిత్ర యూనిట్ మరొక ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. మొదటి ట్రైలర్ కి మించి భీకర పోరాటాలు మరియు మెగాస్టార్ వీరోచిత నటనతో సాగిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఐతే ఈ ట్రైలర్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా సైరా ట్రైలర్ మరియు చిత్ర నిర్మాత రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. చిరు స్థాయికి తగ్గ చిత్రం తీసి చిరంజీవికి మరియు తెలుగు ప్రేక్షకులకు గొప్ప బహుమతిని ఇచ్చిన నిర్మాత రామ్ చరణ్ కి ధన్యవాదాలు అని ఆయన ట్వీట్ చేశారు. ప్రతి విషయంలో లొసుగులు వెతుక్కొని, వ్యగ్యంగా స్పందించే వర్మ సైరా ట్రైలర్ పై ఇలా పాసిటివ్ గా ట్వీట్ చేయడం విశేషం.
ఇక వచ్చే నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని ఐదు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు. చిరంజీవి కి జంటగా నయనతార, తమన్నా నటిస్తుండగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు.
WOWWWW! #SyeRaa is an ultimate befitting tribute to the phenomenon of MEGA STAR CHIRANJEEVI GARU ..Kudos to Producer RAM CHARAN for giving this gift to both his father and the audience ???????????? https://t.co/HE7djQ4fua
— Ram Gopal Varma (@RGVzoomin) September 26, 2019


