ట్రంప్ కి కనీసం వాళ్లకున్న గుర్తింపు కూడా లేదట.

Published on Feb 22, 2020 11:37 pm IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈనెల 24 మరియు 25 తేదీలలో భారత్ సందర్శించనున్నారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం దీనిపై కసరత్తు మొదలుపెట్టడంతో పాటు, అతిథ్యంతో ట్రంప్ ని ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కాగా ట్రంప్ సైతం తానేదో మనవాతీతుడు అయినట్లు తనకు ఇండియాలో ఆహ్వానం పలకడానికి కోటి మంది వస్తారు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో వివాదాల వర్మ ట్రంప్ పై సెటైర్ వేశాడు.

ట్రంప్ కోరుకున్నట్లు ఆయనకు స్వాగతం పలకడానికి కోటి మంది రావాలంటే ఆయన పక్కన సల్మాన్, షారుక్,అమీర్, అమితాబ్, రజిని కాంత్, కత్రినా ఖైఫ్, దీపికా పదుకొనే ని నిలబెట్టాలని ట్వీట్ చేశారు. మనదేశంలో వాళ్ళు తెలిసినంతగా కూడా ట్రంప్ తెలియదు, వాళ్లకున్న క్రేజ్ కూడా ట్రంప్ కి లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు వర్మ.

సంబంధిత సమాచారం :