నిర్మాత ‘వర్మగారు పోయారు’..!

నిర్మాత ‘వర్మగారు పోయారు’..!

Published on Aug 11, 2014 10:00 AM IST

varma-garu-poyaru

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సంచలనం. కరెంట్ అఫైర్స్, బర్నింగ్ ఇష్యూల మీద సినిమాలను తీస్తూ మీడియాతో పాటు ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని కలిగిస్తారు. తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ ఎలా చేయాలో వర్మకు తెలినంత బాగా వేరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వర్మ పేరుతో తన సినిమాకు కావాల్సినంత క్రేజ్ కొట్టేస్తున్నాడు యువ దర్శకుడు అజయ్ కౌండిన్య. ‘వర్మగారు పోయారు’ పేరుతో స్వీయ దర్శకత్వంలో సినిమాను రూపొందించాడు. ఈ సినిమా టీజర్ ఇటివల విడుదల చేశారు.

‘హాయ్, నేను వర్మ. నేను ఎలాంటి సినిమాలు తీసినా చూస్తారు.. ఈ పిచ్చి పబ్లిక్’ అంటూ హీరో చెప్పే డైలాగ్ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ డైలాగ్ విన్న తర్వాత సినిమా ఎవరిని ఉద్దేశ్యించి తీశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని దర్శకుడు తమ సినిమాలో ఎవరిని కించపరిచే సన్నివేశాలు లేవని చెప్తున్నారు.

ఎంతో కష్టపడి తీసిన సినిమా పైరసీ పాలవుతుంది. దాంతో నిర్మాత వర్మ మరణిస్తాడు. ఇది మా సినిమా కథ. పైరసీ వలన సినిమా పరిశ్రమ ఎంత నష్టపోతుందో మా సినిమాలో చూపించాం. ఇదొక సందేశాత్మక చిత్రం అని అజయ్ కౌండిన్య తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరులో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు