సినిమా హిట్ అయినా లేదా తను తీసే సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా సరే ఆపకుండా సినిమాలు తీస్తూ, అలాగే ఎప్పటికప్పుడు తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలిచేడైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ‘అనుక్షణం’. ఇటీవలే ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నామని అనౌన్స్ చేసారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ విడుదలని వాయిదా వేసారు.
ఈ సినిమా వాయిదాకి ప్రధాన కారణం వేలంపాట.మొట్ట మొదటి సారిగా ప్రవేశపెట్టిన వేలం పాట విధానానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో వేలంపాటలో ఎవరు నమ్మశక్యమైన వారు అని తెలుసుకోవడానికి మాకు ఇంకాస్త సమయం పడుతోంది. అందుకే వేలంపాట గడువు తేదీని ఆగష్టు 12 సాయంత్రం 6 గంటల వరకూ పొడిగించారు. అలాగే సినిమా ప్రమోషన్స్ కి కూడా కాస్త టైం కావాలనే ఉద్దేశంతో సినిమాని వాయిదా వేసినట్టు ఈ చిత్ర టీం తెలిపింది. త్వరలోనే రిలీజ్ దేజ్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
‘అమ్మాయిలూ జాగ్రత్త’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. ఒక సైకో కిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. చాలా రోజుల తర్వాత సీనియర్ నటి రేవతి ఈ సినిమా ద్వారా తెలుగులో కనిపించనుంది.


