వర్ష-ఇమాన్యుయల్ పెండ్లి.. జూలై 4న ముహూర్తం.!

Published on Jun 29, 2021 3:00 am IST


బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మీల జంటకు ఎంత క్రేజ్ ఉందో పెద్దగా చెప్పనక్కర్లేదు. అయితే అంతకుమించి అన్నట్టుగా ఇప్పుడు వర్ష-ఇమాన్యుయల్ జోడీ క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ జోడీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. అయితే అవునా.. నిజమా..! అని మాత్రం నోరు ఎల్లబెట్టి ఆలోచించకండి.. ఎందుకంటే నిజంగా వాళ్లు పెళ్లి చేసుకోవడం లేదు.

ఈటీవీలో ప్రసారమయ్యే “శ్రీదేవి డ్రామా కంపెనీ”లో భాగంగా వారిద్దరికి పెళ్లి తంతు జరగబోతుందన్న మాట. అయితే వారిద్దరి పెళ్లి ఎలా జరగబోతుంది, అతిధులు ఎవరొచ్చారు, ఈ పెళ్లిలో ఎలాంటి ఎంటర్‌టైన్మెంట్ అందించబోతున్నారు అనేది తెలియాలంటే వారి పెళ్లి ముహూర్తం అంటే జూలై 4వ తేది ఆదివారం రోజున మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఈటీవీలో ప్రసారమయ్యే “శ్రీదేవి డ్రామా కంపెనీని” మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఇక అంతవరకు ఆగలేము అనుకుంటే మాత్రం ప్రస్తుతానికి ఈ ప్రోమోను చూసేయండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :