ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ‘వరుడు కావలెను’ టీజర్!

Published on Aug 31, 2021 10:14 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా మరో యంగ్ టాలెంట్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వరుడు కావలెను”. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ప్రముఖ నిర్మాత రాధా కృష్ణ గారి పుట్టినరోజు కానుకగా టీజర్ ని రిలీజ్ చేశారు. ముందు నుంచి కూడా మంచి బజ్ ఉన్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఈ టీజర్ చాలా ప్లెజెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి.

రీతూ వర్మ రోల్ ని ఆసక్తికరంగా ఈ టీజర్ లో ప్రెజెంట్ చేశారు. 30 వచ్చినా ఇంకా పెళ్లి అంటే ఇంట్రెస్ట్ చూపని అమ్మాయికి వరుడుగా శౌర్య ఏం చేసాడు అన్నట్టుగా కట్ చేసిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఫ్రేమ్స్ లో నాగ శౌర్య కానీ రీతూ కానీ చాలా అందంగా అనిపించారు.

ఇంకా ప్రతీ ఫ్రేమ్ లో కూడా సినిమాటోగ్రఫీ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే డైలాగ్స్, విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ కూడా ఈ టీజర్ లో బాగుంది. ఓవరాల్ గా మాత్రం ఈ టీజర్ ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. మరి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ లో థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :