బిగ్ బాస్ లో శ్రీ ముఖిని అడ్డంగా బుక్ చేసిన వరుణ్

బిగ్ బాస్ లో శ్రీ ముఖిని అడ్డంగా బుక్ చేసిన వరుణ్

Published on Sep 14, 2019 11:42 AM IST

తెలుగు బిగ్ బాస్ బాస్ లో శ్రీముఖికి లేడి గ్యాంగ్ లీడర్ అనే పేరు ఉంది. హౌస్ లో శ్రీముఖి డామినేషన్ ఎక్కువగానే ఉంటుంది. టాస్క్ లో కావచ్చు, హౌస్ లో ఏమైనా నిర్ణయం తీసుకునే విషయంలో కావచ్చు ప్రతి ఒక్క హౌస్ మేట్ తన మాటే వినాలని శ్రీముఖి అనుకుంటుంది. అందుకే ప్రతి విషయంలో హైపర్ యాక్టీవ్ గా ఉంటూ, ఒక్కోసారి పక్కవాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకుండా అంత తానే చేస్తుంది అనే ఫీలింగ్ కలిగేలా చేస్తుంది.

అలాంటి శ్రీముఖికి నిన్నటి ఎపిసోడ్ లో ఒక గట్టి షాక్ ఇచ్చాడు వరుణ్ సందేశ్. హౌస్ లో “సీక్రెట్స్ అండ్ లైడ్స్” అనే టాస్క్ జరిగింది. ఇందులో హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిగా లేదా జంటగా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తారు. అక్కడ వాళ్ళకి బిగ్ బాస్ కొన్ని పనులు అప్పచెవుతారు. ఆ తర్వాత బయటకు వచ్చి లోపల ఏమి చేశారో వాళ్ళు హౌస్ మేట్స్ కి చెవుతార. అది నిజమో కాదో మిగిలిన హౌస్ మేట్స్ చెప్పాలి. కరెక్ట్ గా చెపితే డిన్నర్ పార్టీ ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు.

ఈ క్రమంలో శ్రీముఖి రాహుల్ విషయంలో ఓవర్ యాక్షన్ చేసింది. రాహుల్ చెపుతుంది నిజమో కాదో అంటూ అతని హార్ట్ దగ్గర చెవిపెట్టి విని నిజమే అంటూ ఫైనల్ చేసింది, వరుణ్ తో సహా ఏడుగురు నిజం కాదని చెప్పినా కానీ శ్రీముఖి వాదించి మరి నిజమని ఫైనల్ చేసింది. చివరికి అది అబద్దం అని తేలింది. దీనితో వరుణ్ శ్రీముఖికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అది నచ్చని శ్రీముఖి వరుణ్ తో వాదనకి దిగింది. ఎప్పుడు కూల్ గా వివాదాలకు దూరంగా ఉంటే వరుణ్ ఈసారి మాత్రం గట్టి స్టాండ్ తీసుకోని శ్రీముఖికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. దీనితో శ్రీముఖి తన వాయిస్ తగ్గించుకొని తర్వాత మిగిలిన టాస్క్ లో సైలెంట్ గా ఉండిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు