పూజా రోల్ పై హింట్ ఇచ్చేసిన వరుణ్, ఫ్యాన్స్ కి నిరాశే…!

Published on Sep 16, 2019 10:30 am IST

నిన్న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో వాల్మీకి ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో వరుణ్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదటిసారి మాస్ క్యారెక్టర్ చేయడం చాలా బాగుందన్న ఆయన, చిత్రం కొరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఐతే పనిలో పనిగా వాల్మీకి చిత్రంలో పూజా పాత్రపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్రంలో పూజా కనిపించేది కేవలం కొద్దిసేపే అని ఆయన చెప్పడం జరిగింది. వరుణ్ కి పూజా కి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ వారిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీలో సాగే లవ్ ట్రాక్ ని హరీష్ ప్లాన్ చేసినట్టున్నారు. అప్పుడే శ్రీదేవి, శోభన్ బాబు ఆల్ టైం హిట్ సాంగ్ “వెన్నొలొచ్చి గోదారమ్మ…” సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ఏదిఏమైనా ఫుల్ టైం రోల్ తో అలరిస్తుందనుకున్న పూజా మూవీలో కొద్దినిమిషాలే కనిపిస్తుందంటే ఫ్యాన్స్ కి నిరాశ కలిగే అంశమే. మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై తెరకెక్కిన వాల్మీకి ఈనెల 20న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More