హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం సినిమాలు విజయం సాధించిన తరువాత వరుణ్ సందేశ్ తిరిగి మరో విజయపు రుచి చూడకపోవడం బాధాకరం. అయితే యావరేజ్ లేకపోతే ఫ్లాప్ చిత్రాల బాటలో వరుణ్ కెరీర్ కొనసాగుతుంది. ఈ పరిస్థితులలో కూడా వరుణ్ ఏడాదికి 2 నుండి 3 సినిమాలు చెయ్యడం విశేషం.
ఈ శుక్రవారం వరుణ్ ‘లవకుశ’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమాలో వరుణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రిచా పనై, రుచి త్రిపాఠి హీరోయిన్స్. జయ్ శ్రీ శివన్ దర్శకుడు. సత్య మోహన్, ప్రకాష్ లు నిర్మాతలు. ఈ సినిమాతోనైనా వరుణ్ ఎదురుచూస్తున్న విజయం తనకు దక్కుతుందని ఆశిద్దాం.


