‘గ్యాంగ్‌ లీడర్‌’ కోసం వెనక్కి వెళ్లిన ‘వాల్మీకి’ !

‘గ్యాంగ్‌ లీడర్‌’ కోసం వెనక్కి వెళ్లిన ‘వాల్మీకి’ !

Published on Aug 27, 2019 6:41 PM IST

వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘వాల్మీకి’. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ కూడా విడుదల అవుతుంది. దాంతో రెండు సినిమాల నిర్మాతలు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. వాల్మీకిని సెప్టెంబర్ 20న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో కూడా గ్యాంగ్‌ స్టర్‌ గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నాడు.

ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ టీజర్‌ సినిమా పై విపరీతంగా అంచనాలు పెంచింది. ముఖ్యంగా ప్రీ టీజర్ లో వరుణ్‌ తేజ్‌ గ్యాంగ్‌ స్టర్‌ లుక్‌ లో చాలా కొత్తగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు. ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు