మొదటి షెడ్యూల్ ముగించిన మెగా హీరో

Published on Mar 11, 2020 10:01 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 24న ఈ సినిమా రెగ్యులర్ షూట్ వైజాగ్లో మొదలైంది. వరుణ్ తేజ్, ఇంకొందరు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. సుమారు రెండు వారాలు జరిగిన ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. వరుణ్ తేజ్ సైతం చిన్న బ్రేక్ తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. తాను చేసిన అన్ని సినిమాల్లోకి ఎక్కువ హార్డ్ వర్క్ ఈ సినిమా కోసమే చేశానని అంటున్న తేజ్ ఫలితంపై చాలా ఆశలే పెట్టుకున్నారు.

ఈ చిత్రం కోసం ఆయన కొన్ని నెలల పాటు ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. అల్లు బాబీ, సిద్దు ముద్దలు దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. ఇకపోతే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నారు.

సంబంధిత సమాచారం :

More