వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడు !

వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడు !

Published on Jun 4, 2018 10:21 PM IST

‘ఘాజి’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ స్పేస్ నేపధ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. సంకల్ప్ ‘ఘాజి’ సినిమాలో మాదిరిగానే ఈ చిత్ర౦తో కూడా ఒక ప్రయోగ౦ చెయ్యబోతున్నాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో అంతరిక్ష నేపథ్యంలో సాగే దృశ్యాలు గొప్పగా ఉంటాయట. ఆ సన్నివేశాల చిత్రీకరణ కోసం భారీ సెట్ నిర్మించారు.

ప్రస్తుతం ఈ సెట్ లోనే షూట్ చేస్తున్నారు. అయితే కొన్ని రిస్కీ సన్నివేశాల్లో వరుణ్ తేజ్ డూప్ ని కూడ వద్దని తనే స్వయంగా రిస్క్ చేసి మరి యాక్ట్ చేస్తున్నాడట. కేవలం ఈ సినిమా కోసమే వరుణ్ తేజ్ ప్రత్యేకంగా జీరో గ్రావిటీ వాతావరణంలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా అదితి రావు హైదరి, అలాగే లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. గ్రాఫిక్స్ ప్రధాన౦గా ఉండే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు