‘వాల్మీకి’ విడుదలకు ముందే హిట్ కొట్టిన వరుణ్ తేజ్

Published on Sep 11, 2019 3:01 am IST

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తమిళ సూపర్ హిట్ సినిమా ‘జిగర్తాండ’కు రీమేక్. మొదటి నుండి ఈ చిత్రంపై ప్రేక్షకులు అమితాశక్తి చూపడానికి ప్రధాన కారణం వరుణ్ తేజ్. సినిమాలో వరుణ్ చేస్తున్న పాత్రే సినిమాకు పెద్ద అసెట్.

టీజర్, ట్రైలర్ రెండింటిలోనూ వరుణ్ తేజ్ అందరినీ డామినేట్ చేసేశాడు. గద్దలగుంట గణేష్ పాత్రలో వరుణ్ బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగ్స్ చెప్పిన విధానం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిపోయాయి. అందరూ సినిమా ఎప్పుడొస్తుందా, వరుణ్ పూర్తిస్థాయి పెర్ఫార్మెన్స్ చూద్దామా అని ఆతురతగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా విడుదలకి ముందే ఫుల్ మార్కులు కొట్టేశాడు ఈ మెగా హీరో.

ఇక ప్రేక్షకులకు నచ్చాల్సింది కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే లాంటి ఇతరత్రా అంశాలే. అవి కూడా క్లిక్ అయితే సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం.

సంబంధిత సమాచారం :

X
More