మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైనప్పటికీ మాస్ ఇమేజ్ కోసం కాకుండా యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని డిఫరెంట్ కథలతో మొదటి రెండు సినిమాలు చేసాడు. యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ మాస్ హీరోగా చేసిన సినిమా ‘లోఫర్’. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మళ్ళీ మాస్ సినిమాలే చేయకుండా క్రేజీ కాంబినేషన్ లో డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు.
మాకు అందిన సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ వరుసగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి వరుసగా సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. అవేమిటంటే.. కంచె తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా కథ సిద్దమవుతోంది, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా కథ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇక దిల్ రాజు కొత్త డైరెక్టర్ తో చేయనున్న ‘ఫీల్ మై లవ్’ సినిమా వర్క్ కూడా జరుగుతోంది. ఇవి మూడు కాకుండా దేవకట్టా డైరెక్షన్ లో ఓ కథ చర్చల దశలో ఉంది. ఇలా వరుణ్ తేజ్ వరుసగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు. ఏడాది రెండు సినిమాలన్నా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో వరుణ్ తేజ తన దగ్గరికి వచ్చిన కథల్లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.


