ఔరా! అనిపించుకుంటున్న వరుణ్ తేజ్

ఔరా! అనిపించుకుంటున్న వరుణ్ తేజ్

Published on May 15, 2014 12:44 PM IST

Varun-Tej

మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్ లో అడుగుపెట్టిన యువ నటుడు వరుణ్ తేజ్. తన మొదటి సినిమా విడుదల కాకముందే, వరుణ్ తేజ్ అన్ని వర్గాల నుండి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం తన మొదటి సినిమా షూటింగ్ కేరళలో జరుగుతుంది. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను వరుణ్ తేజ్ ఆకట్టుకున్నాడు. తన సామర్ధ్యంతో, నటనా చాతుర్యంతో వరుణ్ తేజ్, డైరెక్టర్ ని చాలా ఆకట్టుకున్నాడని యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఇంకా టైటిల్ పెట్టని, ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తీసిన ప్రతి సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా ఉంటాయని తెలుస్తోంది.

తాజా వార్తలు