వాల్మీకి షూటింగ్ లో జాయిన్ అయిన వరుణ్ !

Published on Apr 17, 2019 3:38 pm IST

హరీష్ శంకర్ డైరెక్షన్ లో కోలీవుడ్ కల్ట్ మూవీ ‘జిగర్తండా’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. గత నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుగుతుంది. ఇక ఈషెడ్యూల్ లో మెగా హీరో వరుణ్ తేజ్ పాల్గొంటున్నాడు. సుమారు 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది. ఈసినిమాలో తమిళ యువ హీరో అథర్వ మురళి ని కీలక పాత్ర కోసం తీసుకోగా ఆయనకు జోడిగా డబ్ స్మాష్ ఫేమ్ మిర్నలిని రవి నటిచనుంది. వీరిద్దరికి తెలుగులో ఇదే మొదటిసినిమా.

ఇక ఈ చిత్రంలో వరుణ్ రఫ్ లుక్ లో కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :