సాలిడ్ ప్రీసేల్స్ లో మొదలైన ‘కొరియన్ కనకరాజు’!

సాలిడ్ ప్రీసేల్స్ లో మొదలైన ‘కొరియన్ కనకరాజు’!

Published on Aug 6, 2026 2:00 PM IST

ఈ ఏడాది ఆల్రెడీ యంగ్ హీరో అఖిల్ అక్కినేని లెనిన్ తో మంచి కంబ్యాక్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తాను నటించిన అవైటెడ్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ తనకి కోరుకున్న హిట్ ఇచ్చేలానే ఉందని చెప్పవచ్చు.

ఈ చిత్రం మీద ఉన్న నమ్మకంతో మేకర్స్ వరల్డ్ వైడ్ గా ముందే గ్రాండ్ ప్రీమియర్స్ ని సెట్ చేశారు. యూఎస్ మార్కెట్ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొరియన్ కనకరాజు ప్రీమియర్స్ వేయగా ఈ ప్రీ సేల్స్ లో సాలిడ్ బుకింగ్స్ ని ఈ చిత్రం రిజిస్టర్ చేయడం విశేషం.

తెలుగులో అయితే గత 24 గంటల్లో 11 వేలకి పైగా టికెట్ సేల్స్ జరిగితే దాదాపు ప్రీమియర్స్ షోలు అన్నీ హౌస్ ఫుల్స్ అయ్యిపోయాయ్. ఇక యూఎస్ మార్కెట్ లో ప్రీ సేల్స్ అయితే లక్ష డాలర్స్ మార్క్ ని కూడా దాటేసింది. ఇలా మొత్తానికి కొరియన్ కనకరాజు తో సాలిడ్ స్టార్ట్ అందుకోనుంది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు