“నూటొక్క జిల్లాల అందగాడు” ట్రైలర్ ను విడుదల చేసిన వరుణ్ తేజ్

Published on Aug 25, 2021 4:00 pm IST


అవసరాల శ్రీనివాస్ మరియు రుహాని శర్మ హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. ఈ చిత్రం లో హీరో అవసరాల శ్రీనివాస్ డిఫెరెంట్ పాత్ర లో మొదటి సారిగా నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేయడం జరిగింది. 101 జిల్లాల అందగాడు ట్రైలర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ చిత్ర నిర్మాత వై. రాజీవ్ రెడ్డి, క్రిష్, మరియు శ్రీనివాస్ అవసరాల తో అంతకుముందే పని చేయడం చాలా సంతోషం అని అన్నారు. అంతేకాక ఈ చిత్రం అందరినీ నవ్విస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

నూటొక్క జిల్లాల అందగాడు చిత్రం డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రాచకొండ విద్యా సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు మరియు క్రిష్ సమర్పణ లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాల పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడం తో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3 వ తేదీన థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :