మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మరో హీరో, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘ముకుంద’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం ‘ముకుంద’ ఆడియోని నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. ముకుంద ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీలోవరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.


