వరుణ్‌ తేజ్‌ అంచనాలను అందుకుంటాడా ?

వరుణ్‌ తేజ్‌ అంచనాలను అందుకుంటాడా ?

Published on Jun 26, 2019 6:50 AM IST

వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్మీకి’. ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో కూడా గ్యాంగ్‌ స్టర్‌ గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నాడు. కాగా, ఈ సినిమా ప్రీ టీజర్‌ దెబ్బకి సినిమా పై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా టీజర్ లో వరుణ్‌ తేజ్‌ గ్యాంగ్‌ స్టర్‌ లుక్‌ లో చాలా కొత్తగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.

దాంతో సినిమాలో వరుణ్ లుక్ అండ్ రోల్ పై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. మరి వారందరీ అంచనాలను వరుణ్ అందుకుంటాడో లేదో చూడాలి. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు