తొలి మెగా హిట్ వరుణ్ తేజ్ ఖాతాలోనే !

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘తొలిప్రేమ’ 9న ఓవర్సీస్లో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా నిన్న తెలుగు రాష్ట్రాల్లో విడుదలై బ్రహ్మాండమైన స్పందనను దక్కించుకుంది. ఉదయం మార్నింగ్ షో నుండే అన్ని ఏరియాల్లో మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో సినిమా హిట్ గా ప్రకటితమైంది. దీంతో ఈ 2018లో మెగా ఫ్యామిలీ నుండి తొలి హిట్ అందుకున్న ఘనత వరుణ్ తేజ్ కు దక్కింది.

యూఎస్లో ప్రీమియర్ల ద్వారా 1.52 లక్షల డాలర్లు, శుక్రవారం 1.39 లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమా తొలిరోజుకి 2.91 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది. ఇకపోతే నిర్మాణ సంస్థ లెక్కలు ప్రకారం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 9 కోట్ల పై చిలుకు గ్రాస్ ను వసూలు చేసిందీ సినిమా. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందివ్వగా, జార్జ్ సినిమాటోగ్రఫీ అందించారు.