శేఖర్ కమ్ముల సినిమా సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే..!

శేఖర్ కమ్ముల సినిమా సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే..!

Published on Jul 24, 2016 8:42 PM IST

mister
సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల, మెగా హీరో వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు శ్రీనువైట్లతో ‘మిస్టర్’ అనే సినిమా కూడా చేస్తోన్న వరుణ్, రెండు సినిమాలనూ ఒకేసారి షూటింగ్ జరిపేలా ప్లాన్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

ప్రస్తుతం ‘మిస్టర్’ కోసం స్పెయిన్ వెళ్ళిన వరుణ్, ఆ షెడ్యూల్ పూర్తవ్వగానే ఆగష్టులో శేఖర్ కమ్ముల సినిమాను మొదలుపెట్టనున్నారు. ప్రేమమ్ సినిమా సౌతిండియాలో సంచలనం సృష్టించిన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా తెలంగాణా అమ్మాయి – ఎన్నారై అబ్బాయికి మధ్యన జరిగే ఓ ఆసక్తికర కథగా ప్రచారం పొందుతోంది. శేఖర్ కమ్ముల మార్క్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుందని దిల్‌రాజు చెబుతూ వస్తున్నారు.

తాజా వార్తలు