‘వాల్మీకి’ లుక్ కాపీ కొట్టాడట !

Published on Sep 19, 2019 2:07 am IST

వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల కాబోతున్న చిత్రం ‘వాల్మీకి’. అయితే ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్‌ గ‌ద్ద‌ల కొండ గ‌ణేశ్ అనే గ్యాంగ్‌ స్ట‌ర్ పాత్ర‌లో నటిస్తున్నాడు. మొత్తానికి కొత్త లుక్‌ లో వ‌రుణ్ తేజ్ బాగా ఆక‌ట్టుకున్నాడు. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ ఈ లుక్ గురించి మాట్లాడుతూ.. ‘వాల్మీకి’లో నేను ఈ లుక్‌ లో కనిపించడానికి కారణం చిరంజీవిగారే. నేను ఆయన నుండే ఈ లుక్ ని కాపీ కొట్టాను. పునాదిరాళ్ళు చిత్రంలో చిరంజీవిగారి లుక్‌ ను చూసి.. నేను కూడా అలానే ట్రై చేస్తే బాగుంటుందని చేశాను. అని వ‌రుణ్ తేజ్‌ తెలిపారు.

ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో కూడా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపిస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ రాసిన కామెడీ కూడా సినిమాలో హైలెట్ అవుతుందట. ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More