మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ముద్దుల కుమారుడు వాయువ్ తొలి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ మెసేజ్ పంచుకున్నాడు. “నువ్వు నన్ను కలిసే ముందే నీపై ప్రేమ పుట్టింది.. నిన్ను కన్న తండ్రిగా మారడమే నా జీవితంలో అత్యంత అందమైన ఘట్టం” అంటూ తన కొడుకుపై ఉన్న అమితమైన ప్రేమానురాగాలను చాటుకున్నాడు.
వాయువ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. వరుణ్ తేజ్ రాసిన ఈ ఎమోషనల్ నోట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారి, నెటిజన్ల హృదయాలను ఆకట్టుకుంటోంది.
My dear boy, you changed my world in the best way possible. I fell in love with you even before I laid my eyes on you for the first time. Being your father is the most beautiful part of my life.
Happy 1st birthday, Vaayuv.
I love you, always.❤️😘 pic.twitter.com/nUfXCuBJXF— Varun Tej Konidela (@IAmVarunTej) September 10, 2026


