హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి సినిమాలని చేస్తూ ఇమేజ్ తో పాటు మంచి ఫాలోయింగ్ ను కూడ తెచ్చుకున్న యువ హీరో వరుణ్ తేజ్. ‘ఫిదా, తొలిప్రేమ’ లాంటి సక్సెస్ లతో ఆయన క్రేజ్ రెట్టింపైంది. దాంతో వాణిజ్య సంస్థలు ఆయన్ను తమకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని అప్రోచ్ అవుతున్నాయి.
దీంతో వరుణ్ ప్రముఖ దుస్తుల సంస్థ ఆర్.ఎస్. బ్రదర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ఒప్పుకున్నారు. ఈ విషయాన్నే చెబుతూ కొత్త జర్నీని మొదలుపెడుతున్నానని, ఆర్.ఎస్.బ్రదర్స్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. వరుణ్ తేజ్ ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రస్తుతం ఈ మెగా హీరో సంకల్ప్ రెడ్డి చేస్తున్న స్పేస్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు.


