బ‌జ్… మ‌ట్కా కోసం వ‌రుణ్ సాహసం చేస్తున్నాడా..?

బ‌జ్… మ‌ట్కా కోసం వ‌రుణ్ సాహసం చేస్తున్నాడా..?

Published on Jul 7, 2024 1:00 AM IST

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం త‌న ఫోక‌స్ మొత్తం ‘మ‌ట్కా’ మూవీపైనే పెట్టాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సితో ఈ మెగా హీరో క‌ష్ట‌ప‌డుతున్నాడు. అంతేగాక‌, వ‌రుణ్ తేజ్ కెరీర్ లోనే ‘మ‌ట్కా’ భారీ బ‌డ్జెట్ మూవీగా తెర‌కెక్కుతుండ‌టం.. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతుండ‌టంతో వ‌రుణ్ ఈ సినిమా కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు.

అయితే, మ‌ట్కా మూవీ కోసం వ‌రుణ్ సాహ‌సం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదొక పీరియాడిక్ మూవీ కావ‌డంతో, 50 ఏళ్ల క్రితం ప‌రిస్థితుల‌ను మ‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపెట్ట‌నున్నారు. దీంతో 50 ఏళ్ల క్రితం ఈ సినిమాలో హీరో ఎలా ఉండేవాడ‌నే ఆలోచ‌న‌తో వ‌రుణ్ తేజ్ స‌రికొత్త లుక్ లో క‌నిపిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో వేసిన వైజాగ్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుంద‌ని మ‌న‌కు తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో 50 ఏళ్ల క్రితం హీరో ఎలా ఉంటాడో కూడా మ‌న‌కు తెలిసేలా ఓ ఫోటో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. వ‌రుణ్ తేజ్ క్లీన్ షేవ్ తో రింగుల జుట్టుతో జిమ్ లో వ‌ర్క్ చేస్తున్న ఫోటో నెట్టింట ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది. దీంతో మ‌ట్కా మూవీలో హీరో ఇదే గెట‌ప్ లో క‌నిపిస్తాడ‌నే టాక్ సినీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒక‌వేళ ఈ గెట‌ప్ సినిమాలోనూ క‌నిపిస్తే, నిజంగానే వ‌రుణ్ తేజ్ ఈ సినిమా కోసం సాహసం చేస్తున్నాడ‌నే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు