పూరి – వరుణ్ తేజ్ మూవీకి హీరోయిన్ దొరికేసింది.!

Disha-Patani
ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే కాకుండా, శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేయగల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. గత వారమే ఛార్మీ తో చేసిన ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాని విడుదల చేసిన పూరి జగన్నాధ్ త్వరలోనే వరుణ్ తేజ్ హీరోగా చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. జూన్ మూడవ లేదా నాల్గవ వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. ఈ సినిమాతో పూరి జగన్నాధ్ హీరోయిన్ గా మరో బాలీవుడ్ భామని పరిచయం చేయనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం..

ఇక విషయంలోకి వెళితే… ఇటీవలే ముంబై వెళ్ళిన పూరి బాలీవుడ్ న్యూ కమర్ అయిన దిశా పటాని స్పెషల్ ఫోటోలు చూసి తన సినిమాకి తనైతే పర్ఫెక్ట్ గా సరిపోతుందని దిశాని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. దిశా పటాని జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ సరసన నటిస్తున్న ‘బాఘి’ సినిమాతో బాలీవుడ్ లో పరిచయం కానుంది. తెలుగులో కూడా పూరి జగన్నాధ్ లాంటి పేరున్న డైరెక్టర్ సినిమా ద్వారా తనకి టాలీవుడ్ లో లాంచింగ్ దొరకడంతో దిశా చాలా హ్యాపీగా ఉందని సమాచారం. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించనున్నారు.

Exit mobile version