లోఫర్ ఫినిష్ చేసిన వరుణ్ తేజ్

లోఫర్ ఫినిష్ చేసిన వరుణ్ తేజ్

Published on Oct 31, 2015 9:29 PM IST

varun-tej-puri
దసరా కానుకగా రిలీజ్ అయిన ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంశలు అందుకుంటున్న హీరో వరుణ్ తేజ్. నటన పరంగా వరుణ్ కి చాలా మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమా కంచె. వరుణ్ తేజ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తో కలిసి చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘లోఫర్’. కంచె సినిమా ప్రమోషన్స్ వలన లోఫర్ ఫైనల్ షెడ్యూల్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణ్ తేజ్ కంచె ప్రమోషనల్ టూర్ నుంచి రాగానే లోఫర్ షూట్ లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అవ్వడమే కాకుండా నేటితో లోఫర్ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసాడు.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమా వస్తుండడం వలన ఈ సినిమా లోఫర్ అనే టైటిల్ అంత పర్ఫెక్ట్ కాదేమో అని ఆ టైటిల్ ని మార్చే పనిలో ఉన్న పూరి ప్రస్తుతం ‘మా అమ్మ సీతామహాలక్షి’ అనే పేరును పరిశీలిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ చిత్ర టీం సినిమాని డిసెంబర్ 18న ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆడియో రిలీజ్ చేయనున్నారు. వరుణ్ తేజ్ ఓ దొంగగా కనిపించే ఈ సినిమా ద్వారా దిశా పటాని హీరోయిన్ గా పరిచయం కానుంది. సి కళ్యాణ్ నిర్మాత.

తాజా వార్తలు