వరుణ్ తేజ్ “గని” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్

వరుణ్ తేజ్ “గని” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్

Published on Mar 15, 2022 11:14 AM IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. అల్లు బాబీ కంపనీ మరియు రినైస్సన్స్ పిక్చర్స్ పతాకంపై సిద్ధు ముద్ద మరియు అల్లు బాబీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ను ఏప్రిల్ 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 8 వ తేదీన విడుదల కి సిద్దం అవుతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ ను మార్చ్ 17 న ఉదయం 10:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు