1940 బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ – క్రిష్ మూవీ

1940 బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ – క్రిష్ మూవీ

Published on Feb 19, 2015 1:40 AM IST

Varun-teja-krish (1)
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన యంగ్ హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ చేసిన మొదటి సినిమా ‘ముకుంద’ తనకి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాళ్ళే పూరి జగన్నాధ్ మరియు క్రిష్. ఈ రెండు సినిమాలు కొంత గ్యాప్ లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇందులో వరుణ్ తేజ్ – క్రిష్ కాంబినేషన్ లో రానున్న మూవీ గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలను మీకందిస్తున్నాం..

‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి డిఫరెంట్ సినిమాలు తీసిన క్రిష్ వరుణ్ తేజ్ కోసం కూడా ఓ డిఫరెంట్ కథని రెడీ చేసాడు. ఈ సినిమా మొత్తం 1940 టైంలో అనగా స్వాతంత్ర్యం రాక ముందునాటి కాలంలో జరుగుతుంది. ఇదొక ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. దీని గురించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తనని తానూ మేకోవర్ చేసుకునే పనిలో ఉన్నాడు. పూరి జగన్నాధ్ కూడా ఛార్మీతో చేస్తున్న ‘జ్యోతి లక్ష్మీ’ అవ్వగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

తాజా వార్తలు