వరుణ్ తేజ్ ‘లోఫర్’ మాస్ ఇమేజ్ కోసమేనా.?

వరుణ్ తేజ్ ‘లోఫర్’ మాస్ ఇమేజ్ కోసమేనా.?

Published on Jun 22, 2015 4:12 PM IST

varun-tej

హీరో కోసం మాస్ పాత్రలని సృష్టించడంలో, వాటిని పర్ఫెక్ట్ గా ప్రెజంట్ చేయడంలో మరియు పాత్రకన్నా మించి ఉండేలా మాస్ టైటిల్స్ పెట్టడంలో డాషింగ్ డైరెక్టర్ స్పెషలిస్ట్ ని చెప్పాలి. ప్రతి సినిమాలోనో హీరో పాత్ర చాలా మాస్ గా ఉంటూ రఫ్ అండ్ తఫ్ బిహేవియర్ తో దూసుకెలుతుండాడు. సినిమా సక్సెస్ కాకపోయినా ఆ హీరోకి మాత్రం ఫుల్ మాస్ ఇమేజ్ వస్తుంది. అలాంటి మాస్ ఇమేజ్ నే మెగా హీరో వరుణ్ తేజ్ కి ఇవ్వడం కోసం పూరి సిద్దమయ్యాడు. అందులో భాగంగా మొదట చేసిన పని ఈ సినిమాకి ప్రజలు బాగా వాడుకునే నెగటివ్ పదాన్ని సినిమా టైటిల్ గా సెలక్ట్ చెయ్యడం. ఆ పేరే ‘లోఫర్’.

వరుణ్ తేజ్ సినిమాకి లోఫర్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు నిన్ననే అనౌన్స్ చేసారు. ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో అదే చర్చనీయాంశం అయ్యింది. వరుణ్ తేజ్ కి ఫుల్ మాస్ ఇమేజ్ ఇవ్వడం కోసం పూరి జగన్నాద్ ఆ టైటిల్ పెట్టాడని, ఆ టైటిల్ లానే సినిమా కూడా ఫుల్ మాస్ గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ టైటిల్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దిశా పటాని హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా షూటింగ్ జూలై 1నుంచి ప్రారంభం కానుంది. ఆగష్టు చివరికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

తాజా వార్తలు