త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న వరుణ్ తేజ్ మూవీ.?

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న వరుణ్ తేజ్ మూవీ.?

Published on Jan 11, 2015 2:00 PM IST

varun-tej
మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అయిన యంగ్ హీరో వరుణ్ తేజ్.. వరుణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద’ డిసెంబర్ 25న రిలీజ్ అయ్యి డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టుకుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మన్స్ విషయంలో మంచి మార్కులు కొట్టేసాడు. వరుణ్ నటించే సెకండ్ సినిమా పూరి జగన్నాధ్ లేదా క్రిష్ డైరెక్షన్ లో మొదలవ్వాలి కానీ ఇన్ని రోజులుగా క్లారిటీ లేని ఈ విషయంపై మాకో సమాచారం అందింది.

వరుణ్ తేజ్ సెకండ్ మూవీ క్రిష్ డైరెక్షన్ లో ఉంటుంది. ముందుగా క్రిష్ వరుణ్ తేజ్ మొదటి సినిమా చేయాలి కానీ క్రిష్ గబ్బర్ తో బిజీగా ఉండడం వలన ఆ చాన్స్ శ్రీకాంత్ అడ్డాలకి దక్కింది. క్రిష్ – వరుణ్ తేజ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. ఈ సినిమా జనవరి చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు