వైరల్ అవుతోన్న వరుణ్ తేజ్ లుక్ !

Published on Apr 19, 2019 3:58 am IST

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రం నుండి తాజాగా వచ్చిన వరుణ్ తేజ్ స్టిల్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ రోజు హరీశ్ శంకర్, వరుణ్ తేజ్ పై కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. కాగా ఆ సీన్స్ లోని తన గెటప్ కు సంబంధించిన ఓ స్టిల్‌ ను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ స్టిల్‌ మెగా అభిమానులను బాగా అలరిస్తోంది. ఇక ఈ చిత్రంలో తమిళ యంగ్ హీరో అథర్వ మురళి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :