వరుణ్ స్పేస్ థ్రిల్లర్ టైటిల్ ఆ రోజే ప్రకటించనున్నారు !

వరుణ్ స్పేస్ థ్రిల్లర్ టైటిల్ ఆ రోజే ప్రకటించనున్నారు !

Published on Aug 12, 2018 3:46 PM IST

ఫిదా , తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకొన్న యువ హీరో వరుణ్ తేజ్ ఘాజీ’ చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న స్పేస్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు విడుదల తేదీ ని ఆగస్టు 15న ప్రకటించనున్నారు.

లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఇక వరుణ్ ఈ చిత్రం తో పాటు అనిల్ రావిపూడి తెరక్కిస్తున్నా ఎఫ్2 అనే మల్టీ స్టాటర్ చిత్రంలో అగ్ర హీరో వెంకటేష్ తో కలిసి నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు