చేతన్, కావ్య, రాజీవ్ ప్రధాన పాత్రల్లో ఆలాపన స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘వశం’. కోన రమేష్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కోన రమేష్ మాట్లాడుతూ… ఇది నగరం మరియు గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథ అని తెలిపారు. నగరంలో పెరిగిన ఓ యువకుడు గిరిజన యువతిని గాఢంగా ప్రేమించి, చివరికి నగరానికే చెందిన మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే ఆసక్తికరమైన మలుపుతో ఈ సినిమా ఉంటుందని వివరించారు.
హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా, ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉండేలా తీర్చిదిద్దామని దర్శకుడు పేర్కొన్నారు. కాండ్రేగుల చందు, సలాపు మోహనరావు, కుబిరెడ్డి వెంకన్న దొరల సహకారం మరువలేనిదని తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం కిరణ్ తోటంబ్లే అందించగా, శంకర సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. యెన్నం శెట్టి ఆంజనేయులు నిర్మాతగా, రేగం మత్యలింగం (ఎమ్మెల్యే), పోతూకూరి దేముడు, వడిగొండ అర్జున అప్పారావు కో-ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.


