విడుదల తేదీ : జూలై 10, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : మహేంద్రన్, అంబికా వాణి, జాన్ విజయ్, ‘మైమ్’ గోపి, సురేష్ చంద్ర మీనన్, ఐశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, ‘జబర్దస్త్’ రామ్ ప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్
దర్శకత్వం : వైకుంఠ్ బోను
నిర్మాత : ధనలక్ష్మి బాదర్ల
సంగీతం :మణిశర్మ
ఛాయాగ్రహణం : జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్)
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘వసుదేవ సుతం’. వైకుంఠ బోను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :-
గుడిలోని నిధి చుట్టూ ఈ కథ సాగింది. కిషోర్ (మాస్టర్ మహేంద్రన్) తన అక్క జీవితాన్ని నాశనం చేసిన విషయం పై ఊరికి వెళ్తాడు. అప్పటికే, ఆ ఊరిలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. వసుదేవుని గుడి నేపథ్యంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కిషోర్ కి భూమి (అంబికా వాణి) కనెక్ట్ అవుతుంది. అతన్ని చూడగానే ఆమె మనసు స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడతారు. అయితే, ఈ ప్రేమ ఇష్టం లేని భూమి ఫ్యామిలీ, కిషోర్ కి వార్నింగ్ ఇస్తోంది. అంతలో కిషోర్ పై ఎటాక్ జరుగుతుంది. ఐతే, ఈ ఎటాక్ కి భూమి ఫ్యామిలీకి సంబంధం ఉండదు. మరి కిషోర్ పై ఎటాక్ చేసింది ఎవరు ?, అసలు కిషోర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
మైథాలజీ టచ్ చేస్తూ తీసిన ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన మహేంద్రన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ లో బాగానే నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా మహేంద్రన్ నటన బాగుంది. హీరోయిన్ అంబికా వాణి తన నటనతో అలరించింది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో కూడా ఆమె నటన బాగుంది.
సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన జాన్ విజయ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. మరో కీలక పాత్రలో ఐశ్వర్య లక్ష్మి కూడా ఆకట్టుకుంది. హీరోకి తల్లి పాత్రలో తులసి ఒదిగిపోయింది. మైమ్’ గోపి, సురేష్ చంద్ర మీనన్, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, ‘జబర్దస్త్’ రామ్ ప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహవన్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ ‘వసుదేవ సుతం’ సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ స్క్రీన్ ప్లే ఫుల్ ఇంట్రెస్ట్ గా సాగితే బాగుండేది. హీరో పాత్ర రైజ్ కోసం మెలో డ్రామా సీన్స్ ను పెట్టడం బాగాలేదు. అలాగే విలన్ పాత్రను ఇంకా బలంగా రాసుకోవాల్సింది. అలాగే, కథలో చాలా చోట్ల బలమైన కాన్ ఫ్లిక్ట్ ను ఎస్టాబ్లిష్ చేయాల్సింది. నిధి ఆధారంగా కథ అల్లుకోవడం బాగుంది.
ఐతే, ఆ నిధి చుట్టూ ఇంకా కథను బలంగా అల్లుకోవాల్సింది. ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ లోని ప్రేమ సన్నివేశాలు కూడా బలంగా రాసుకోవాల్సింది. అలాగే హీరోవిలన్ల మధ్య యాక్షన్ ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. అదే విధంగా జిజ్జు సన్నీ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఐతే, దర్శకుడు రాసిన కథలో మ్యాటర్ ఉంది. దర్శకత్వం కూడా బాగుంది. ఇక ఈ సినిమాలో నిర్మాత ధనలక్ష్మి బాదర్ల పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
ఎమోషనల్ టచ్ తో ‘వసుదేవ సుతం’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలో.. మెయిన్ కాన్సెప్ట్, మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగున్నాయి.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
