ఇంటర్వ్యూ : వేదిక – నటనకు చాల స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాది

Published on Dec 16, 2019 4:05 pm IST

కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం ‘రూలర్’. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటించారు. కాగా ఈ సంధర్భంగా వేదిక మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

 

చాల సంవత్సరాల తరువాత తెలుగులో నటిస్తున్నారు. ఎలా అనిపిస్తోంది ?

అవును. డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పైనే అయింది. ఇన్నేళ్లు తమిళ్ మలయాళ సినిమాలు చేస్తున్నాను. అయితే నేను హీరోయిన్ గా నటించిన ‘కాంచన’ తెలుగులో కూడా డబ్ అయి సూపర్ హిట్ అయింది. మళ్లీ ఇప్పుడు రూలర్ తో రాబోతున్నాను.

 

ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది ?

‘కాంచన’ తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడం, ఆ సినిమాలో నాకు మంచి పేరు రావడం వల్లే.. ఈ సినిమా వచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ కి కూడా నేను బాగా సెట్ అవుతున్నానని డైరెక్టర్ గారు ఫీల్ అయ్యారు.

 

మొదటిసారి బాలకృష్ణతో కలిసి నటించారు. ఆయనతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది ?

తెలుగు ఇండస్ట్రీలోనే ఆయన లెంజెండ్, రియల్ లైఫ్ లో కూడా రూలర్ లాంటి ఆయనతో కలిసి నటించడం చాల హ్యాపీగా అనిపించింది. ఆయన నుంచి చాల నేర్చుకున్నాను.

 

బాలకృష్ణగారి గురించి చెప్పండి ?

గ్రేట్ యాక్టర్ అండి. నటన పట్ల ఆయనకున్న అంకితభావం అమేజింగ్. కొన్ని సీన్స్ చేయలేనప్పుడు కో స్టార్స్ కి కూడా చాల హెల్ప్ చేస్తారు. అంత పెద్ద స్టార్ ఆయి ఉండి కూడా చాల సింపుల్ గా ఉంటారు, అందర్నీ ఒకేలా చూస్తారు. ఎవరైనా ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు అందరికి సాయం చేసే పెద్ద మనసు ఆయనది.

 

రూలర్ లో మీ పాత్ర గురించి ?

నా క్యారెక్టర్ లో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ట్రేడిషనల్ గా కనిపిస్తాను, అలాగే గ్లామర్ గర్ల్ నటించాను. అదేవిధంగా నా క్యారెక్టర్ లో సీరియస్ యాంగిల్ కూడా ఉంటుంది. నటనకు చాల స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాది.

 

సినిమాలో మీ పై ఎన్ని సాంగ్స్ ఉంటాయి ?

రెండు సాంగ్స్ ఉంటాయి. ఒకటి సంక్రాంతి సాంగ్, మరొకటి మెలోడీ సాంగ్. సాంగ్స్ కూడా చాల బాగా వచ్చాయి.

 

మీ తదుపరి సినిమాలు గురించి ?

తెలుగులో కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇంకా ఏది ఫైనల్ కాలేదు. ప్రస్తుతం తమిళ్ మళయాలంలో కూడా మూవీస్ చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :

More