మెగాస్టార్ చిరంజీవి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయిన సంగతి తెలిసిందే. వెంకయ్య నివాసంలో సైరా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే ఈ చిత్ర ప్రదర్శనకు పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. కాగా సినిమా చూసిన వెంకయ్య నాయుడు సినిమా పై స్పందిస్తూ.. ‘ఊరువాడ చూడదగిన ఉత్తమ చిత్రం ‘సైరా’. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణా దాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు’ వెంకయ్య ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇక స్వాతంత్ర్యం కోసం తొలి సమరం ప్రారంభించిన వీరుడి కథ కావడం, ఆ పోరాటం కోసం ప్రాణాల్నే అర్పించడంతో ‘సైరా’ చిత్రం ఒక దేశభక్తుడి చిత్రంగా పేరు తెచ్చుకుంది. సినిమా చూసిన అందరూ కూడా అందరూ తప్పక చూడాల్సిన చిత్రం అంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా చిరంజీవి పలువురు ప్రముఖలను కోరుతున్న సంగతి తెలిసిందే.
ఊరువాడ చూడదగిన ఉత్తమ చిత్రం 'సైరా'. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణా దాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు. #SyraaNarashimaReddy pic.twitter.com/rUJrM353Dv
— Vice-President of India (@VPIndia) October 16, 2019
