వెంకటేష్ – పవన్ కళ్యాణ్ లపై స్పెషల్ సాంగ్.!

వెంకటేష్ – పవన్ కళ్యాణ్ లపై స్పెషల్ సాంగ్.!

Published on Aug 26, 2014 6:13 PM IST

gopala-gopala
స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయడం అనే ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఊపందుకుంటోంది. ప్రస్తుతం ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో సెట్స్ పై ఉన్న సినిమా ‘గోపాల గోపాల’. విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ కి రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రని ముందు అనుకున్న దానికంటే పెంచారని ఇది వరకే తెలియజేశాం. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తి కరమైన విషయం మీకు తెలియజేయనున్నాం. ‘ ‘గోపాల గోపాల’లో పవన్ కళ్యాణ్ – వెంకటేష్ లపై ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. హిందీ వెర్షన్ లో ఈ స్పెషల్ సాంగ్ ఉండదు. అలాగే హిందీలో కంటే తెలుగులో వెంకీ – పవన్ పాత్రలను తెలుగులో పొడిగించామని’ ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు తెలిపాడు.

వెంకటేష్ కి జోడీగా శ్రియ శరన్ నటిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్, అనీష అంబ్రోస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కిషోర్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు