వెంకటేశ్, వరుణ్‌తేజ్ భార్యా బాధితులు అట ?

వెంకటేశ్, వరుణ్‌తేజ్ భార్యా బాధితులు అట ?

Published on Aug 12, 2018 6:48 PM IST

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం ‘ఎఫ్ 2 ’ ‘ఫన్ అండ్ ఫ్ర‌స్ర్టేషన్’ అనేది ఉపశీర్షిక. ఐతే ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉండనుందని తెలుస్తోంది. ఐతే ఈ చిత్ర కథ ఇదేనంటూ ఓ ఆసక్తికరమైన పాయింట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల చల్ చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. వెంకటేశ్, వరుణ్‌తేజ్ భార్యా బాధితులుగా ఫ్రస్ట్రేట్ డ్ భర్తలుగా కనిపించబోతున్నారట. ముఖ్యంగా భార్యలు పెట్టే ఇబ్బందులు భరించలేక ఈ ఇద్దరు హీరోలు ఫ్రస్ట్రేట్ కి గురై బ్యాంకాక్ వెళతారట. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయునేదే అసలు కథ అని తెలుస్తోంది. అనిల్ ఈ చిత్రాన్ని పూర్తి హాస్యభరితంగానే చిత్రీకరించనున్నారట. జంధ్యాలగారి చిత్రం ఈ చిత్రానికి ఇన్సిపిరేషన్ అని సమాచారం. ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు