బిగ్ బాస్ ,మీలో ఎవరు కోటీశ్వరుడు మొదటగా నా దగ్గరికే వచ్చాయి – వెంకటేష్ !

Published on Jan 20, 2019 11:29 am IST


సినీ ఇండస్ట్రీ లో వివాద రహితుడుగా పేరుతెచ్చుకుని ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా అందరికి ఇష్టమైన నటుడు గా మారారు సీనియర్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్. ‘గురు చిత్రం’ తరువాత గ్యాప్ తీసుకొని ఎఫ్ 2 అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటించారు వెంకీ. ఇటీవల విడుదలైన ఈచిత్రం బాక్సాఫిస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ఈచిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న వెంకీ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వెళ్లనున్నారా అని అడిగిన ప్రశ్నకు వెంకీ సమాధానిస్తూ బిగ్ బాస్ , మీలో ఎవరు కోటీశ్వరుడు షోలు ముందుగా నా దగ్గరికే వచ్చాయి. కానీ నేను ఆ ఆఫర్లును తిరస్కరించాను. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 3 కి హోస్ట్ చేయనున్నాను అని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని అన్నారు. అలాగే నటుడిగా సవాళ్ళను ఇష్టపడుతానని కానీ ఎలాంటి సినిమాలు చెప్పలేనని దంగల్ ,తారే జమీన్ పర్ లాంటి చిత్రాలు చేయాలని అనుకుంటున్నట్లు వెంకీ వివరించారు.

ఇక వెంకీ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు వున్నాయి. అందులో ఒకటి మల్టీ స్టారర్ వెంకీ మామ చిత్రం. బాబీ తెరకెక్కించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి నుండి మొదలు కానుంది. ఇక ఈ సినిమా తరువాత వెంకీ సోలో హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు.

సంబంధిత సమాచారం :