చిన్నోడి సినిమా విశేషాలు తెలుసుకోవడానికి పెద్దోడు వస్తున్నాడు

Published on Jan 15, 2020 11:00 pm IST

చిన్నోడు మహేష్ నటించిన చిత్ర విశేషాలు తెలుసుకోవడానికి పెద్దోడు వెంకటేష్ వస్తున్నారు. వెంకటేష్, మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ కలిగిన అన్నదమ్ములుగా వీరు ఆ చిత్రంలో అద్భుతంగా నటించారు. కాగా మహేష్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ లో వెంకటేష్ పాల్గొననున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్ర విశేషాలు అడిగి తెలుసుకోనున్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

వెంకటేష్ కి మహేష్ తో ఉన్న ప్రత్యేక అనుబంధం రీత్యా ఈ కార్యక్రమంలో వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి గత ఏడాది వెంకటేష్ కి ఎఫ్ 2 రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విజయ శాంతి కీలక రోల్ చేశారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :