‘వెంకీ మామ’కి రెండు వారాల పాటు విశ్రాంతి !

‘వెంకీ మామ’కి రెండు వారాల పాటు విశ్రాంతి !

Published on Aug 18, 2019 11:27 AM IST

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వెంకీ – చైతు కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. కాగా రామోజీ ఫిలిమ్‌ సిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో విక్టరీ వెంకటేశ్ కి స్వల్పంగా గాయపడ్డారు. వెంకటేశ్, పాయల్ రాజ్‌పుత్ మధ్య పాటను చిత్రీకరిస్తుండగా.. డ్యాన్స్ చేస్తున్నప్పుడు వెంకటేశ్ కాలు స్వల్పంగా బెణికింది. దీంతో ప్రస్తుతం షూటింగ్‌ ను కూడా ఆపేశారు. గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారట.

ఇక గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది. ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా దర్శకుడు బాబీ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్రం నుండి ఇటివలే చిన్న మేకింగ్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో వెంకీ – చైతు లుక్స్ అండ్ మ్యానరిజమ్స్ బాగా ఆకట్టుకోవడంతో సినిమా పై మొత్తానికి ఈ వీడియో బాగానే అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు